హైదరాబాద్ : ప్రజలకు అనుక్షణం రక్షణగా ఉండే పోలీసులే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడం కలకలం సృష్టిస్తుంది. ఈనెల 28న రాత్రి చిత్తూరు నుంచి కాచిగూడకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (Venkatadri Express) లో వస్తున్న ఓ కుటుంబంలోని పదిహేనేండ్ల బాలికపై హోంగార్డు అసభ్యకరంగా ప్రవర్తి్ంచాడు.
ఎస్ 3 కోచ్‌లో ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లోయర్ బెర్త్‌లో నిద్రబోగా అప్పర్ బెర్త్‌లో నిద్రిస్తున్న బాలిక ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ కోడూరుకు చెందిన హోంగార్డు ప్రతాప్(Home Guard Pratap) అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బుధవారం బాలిక తల్లిదండ్రులు కాచిగూడ స్టేషన్లో దిగిన తరువాత హోంగార్డుపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కాచిగూడ ఆర్పీఎస్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి హైదరాబాద్‌లో నివాసముంటున్న హోంగార్డు ప్రతాప్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడికి తరలించినట్లు వెల్లడించారు.