జంట జలాశయాల్లో.. జలసవ్వడి

- రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టం
- దశాబ్దం తర్వాత గండిపేట 2గేట్లు ఎత్తిన అధికారులు
- హిమాయత్‌సాగర్ 5 గేట్లతో దిగువకు నీరు
- వరద ఉధృతి పెరిగితే.. మరిన్ని గేట్లు తెరిచే చాన్స్
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ మణికొండ/ చాదర్‌ఘాట్: గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో నగర శివారులోని జంట జలాశయాలకు జలకళ వచ్చింది. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరడంతో రెండు రోజుల క్రితమే మూడు గేట్లను ఒకఫీటు ఎత్తువరకు ఎత్తి నీటిని దిగువన ఈసీ నది ద్వారా మూసీలోకి వదులుతున్న అధికారులు గురువారం మరో రెండు గేట్లను ఎత్తారు.ఉస్మాన్‌సాగర్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలతో ప్రస్తుతం 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 (3.90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1784.90 (2.817 టీఎంసీలు) వరకు నీటిమట్టం చేరింది. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు వాటర్‌బోర్డు జీఎం రామకృష్ణ, డీజీఎం నరహరి ఆధ్వర్యంలో రెండు గేట్లను ఒక ఫీటు వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 (2.97 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1762.65 (2.725 టీఎంసీలు) అడుగుల వరకు నీరు ఉందని, ఐదు గేట్ల ద్వారా 1,030 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతుండగా, సుమారు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని, రాత్రి వరకు ఇది పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వరద పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తుతామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

