హెచ్‌సీయూలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

శేరిలింగంపల్లి, ఆగస్టు 23 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం… పెద్దపల్లి జిల్లా తేరెపల్లి గ్రామానికి చెందిన ఆర్.మౌనిక హెచ్‌సీయూలో ఎంటెక్ మెటీరియల్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్-7లోని 20వ నంబర్ గదిలో ఉంటుంది. కాగా ఆదివారం నుంచి మౌనిక హాస్టల్ గదిలోనుంచి బయటకు రాలేదు. స్నేహితులు ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితులు యూనివర్సిటీ, హాస్టల్ సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి మౌనిక గది వద్దకు చేరుకున్న వారు తలుపు, గడియ తొలగించి చూడగా.. ఉరివేసుకొని కనిపించింది. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- HCU Student
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

