ప్రధానమార్గాల్లో..కొత్తరోడ్లు

జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే అన్ని సర్కిల్ కార్యాలయాల పరిధిలోని ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంతోపాటు సీఆర్ఎంపీ ద్వారా పనులు చేపడుతున్నారు. మొజాంజాహి మార్కెట్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు, అబిడ్స్ జంక్షన్ నుంచి బాబు జగ్జీవన్‌రాం విగ్రహం జంక్షన్ వరకు, బాబు జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ ఫ్లైఓవర్ కింది భాగంలో, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి లిబర్టి జంక్షన్ వరకు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1, రోడ్ నంబర్-36లో ఈ బీటీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోడ్డు మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన మార్గాల్లో రహదారుల నిర్మాణానికి సీఆర్ఎంపీ ద్వారా ఏజెన్సీలకు అప్పగించి ఆయా ఏజెన్సీల ద్వారా పనులను చేపడుతున్న విషయం విదితమే. ఇదిలాఉండగా దెబ్బతిన్న రహదారులకు రీకార్పెటెడ్ పనులను చేపడుతున్నారు. 12,13, 14 సర్కిల్ కార్యాలయాల పరిధిలోని ప్రధాన మార్గాల్లో ఈ నూతన రోడ్డు నిర్మాణ పనులు దాదాపు 171 కిలోమీటర్ల వరకు పనులు చేపట్టామని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- ghmc roads
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

