సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : క్రీడాభివృద్ధికి జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ఆటలను ప్రోత్సహించేలా ప్రతి ఏటా తరహాలోనే ఈ వేసవిలోనూ చిన్నారులకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి.. నిష్ణాతులైన క్రీడాకారులుగా తయారు చేసేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంపు -2024కు ఏర్పాట్లు చేస్తున్నది.
ఏప్రిల్ 25 నుంచి జూన్ మొదటి వారం వరకు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో 6 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు వివిధ క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి డివిజన్‌కు రెండు లక్షల చొప్పున క్రీడా సామగ్రిని వచ్చే నెల రెండో వారంలోగా అందజేయనున్నారు.