గడ్డి అన్నారం టూ బాట సింగారం

- పండ్ల మార్కెట్ తరలింపు ఖరారు
- అక్టోబర్ 1 నుంచి అక్కడే విక్రయాలు
- 44 ఎకరాల్లో గోదాములు, అమ్మకాలకు ఏర్పాట్లు
- రైతులు, కమీషన్‌దారులు, వ్యాపారులకు చక్కటి వసతులు
- లాజిస్టిక్ పార్కుకు నేరుగా సరుకు రవాణా వాహనాలు
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపు ఖాయమైంది. అక్టోబర్ 1 నుంచి విజయవాడ హైవేపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్క్‌లో పండ్ల విక్రయాలు జరగుతాయని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పద్మ హర్ష వెల్లడించారు. ప్రస్తుతమున్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి కసరత్తు శరవేగంగా సాగుతోంది. 44 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన బాటసింగారం లాజిస్టిక్ పార్క్‌లో పండ్ల విక్రయాల కోసం షెడ్లు, నిల్వ చేసేందుకు గోదాములు, రైతుల విశ్రాంతి కోసం ప్రత్యేక భవనం, పెట్రోల్‌బంక్, బ్యాంకు, ఏటీఎం కేంద్రాలు, పోలీసు ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు దూరప్రాంతాల నుంచి పండ్ల వాహనాలు నేరుగా బాటసింగారం చేరేందుకు చక్కటి రవాణా సౌకర్యం ఉంది.
గడ్డి అన్నారంలో కొనసాగుతున్న పండ్ల మార్కెట్ ఇక బాట సింగారంలో ఏర్పాటు కానున్నది. విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బాటసింగారం సమీపంలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్కును సైతం ఈ మార్కెట్‌కు కేటాయించారు. అక్టోబర్ 1 నుంచి ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో బాటసింగారంలో ఏర్పాటు చేస్తున్న పండ్ల మార్కెట్లో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. 44 ఎకరాల విస్తీర్ణంలోని లాజిస్టిక్ పార్కులో ఈ నూతన పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.90 లక్షలతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రయవిక్రయాల కోసం లక్ష ఎస్ఎఫ్టీల సామర్థ్యం గల గోదాములను వినియోగించనున్నారు.
మామిడి సీజన్లో మరో నాలుగు ఎకరాల్లో తాత్కాలికంగా గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అంతేకాక వివిధ రాష్ర్టాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మార్కెట్‌కు మామిడి పండ్లు దిగుమతి అవుతుండటంతో మార్కెట్ పక్కనే ఉన్న మరో 8 ఎకరాల స్థలం లీజుకు తీసుకొని ప్రత్యేకంగా గోదాములు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక మార్కెట్లో పార్కింగ్ సౌకర్యంతో పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాలుగు లేన్ల రోడ్డును అందుబాటులోకి తెచ్చారు.
తప్పనున్న తిప్పలు..
బాటసింగారంలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్‌తో అటు రైతులు, ఇటు వ్యాపారులకు తిప్పలు తప్పనున్నాయి. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్లోకి రాత్రి సమయంలోనే వాహనాలకు అనుమతి ఉండేది. ఉదయం 8 గంటల తర్వాత వచ్చిన వాహలన్నీ రాత్రి 10 గంటల వరకు నగరం బయటనే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌కు వచ్చేందుకు రవాణా ఆంక్షలు లేవు. ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా సరుకును మార్కెట్‌కు తేవచ్చు. బెంగళూరు, ముంబయి, విజయవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారు నేరుగా ఔటర్‌రింగ్‌రోడ్డు మీదుగా పెద్ద అంబర్‌పేట ఎగ్జిట్ వద్ద దిగి పండ్ల మార్కెట్‌కు చేరుకునే అవకాశం ఉంది.
ఏర్పాట్లు పూర్తి..
నూతన పండ్ల మార్కెట్‌ను అక్టోబర్ 1న ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం గడ్డి అన్నారం నుంచి కార్యకలాపాలు
నిర్వహిస్తున్న వ్యాపారులంతా అక్టోబర్ 1 నుంచి బాట సింగారం మార్కెట్ నుంచి లావాదేవీలు నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ కంటే బాటసింగారంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో అత్యాధునిక వసతులు ఉండటంతో వ్యాపారులు అక్కడికి వెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
లక్ష ఎస్ఎఫ్టీల్లో గోదాములు..
బాట సింగారం పండ్ల మార్కెట్లో ప్రస్తుతం లక్ష ఎస్ఎఫ్టీల సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. ఇందులో 50 వేల ఎస్ఎఫ్టీల్లో అతి పెద్ద గోదాం, మిగిలిన స్థలంలో చిన్న గోదాములు ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిపేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించారు. అలాగే రైతుల రెస్ట్ రూంతో పాటు పరిపాలన భవనాన్ని ఏర్పాటు చేశారు. పండ్ల ఎగుమతులు, దిగుమతి చేసుకునేందుకు ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
మౌలిక వసతులు కల్పన..
- బాటసింగారం మార్కెట్లో రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గోదాములు కేటాయిస్తున్నారు.
- వ్యాపారులు, రైతులు, హమాలీలు, వాహనదారుల కోసం బ్యాంక్‌ను సైతం ఏర్పాటు చేశారు.
- అతిపెద్ద ధర్మకాంటను నెలకొల్పారు.
- పెట్రోల్ బంక్‌తో పాటు క్యాంటిన్‌ను ఏర్పాటు చేశారు.
- మార్కెట్ సమీపంలో పోలీస్ ఔట్‌పోస్టును నిర్మిస్తున్నారు.
- వైద్యం అందించేందుకు దవాఖాన ఏర్పాటుతో పాటు ఉచితంగా మందులు అందజేయనున్నారు.
- తాగునీరు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు.
- విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
సవ్యంగా వ్యాపారాలు చేసుకోవచ్చు..
బాటసింగారంలో ఏర్పాటు చేస్తున్న నూతన పండ్ల మార్కెట్లో సకల సౌకర్యాలు కల్పించాం. రైతులు, హమాలీలు, కమిషన్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గడ్డి అన్నారం మార్కెట్‌కు ఉదయం వచ్చే వాహనాలపై నిషేధం ఉండేది. కొత్త మార్కెట్‌కు అలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా రావచ్చు. సరుకును అమ్ముకొని పోవచ్చు. అక్టోబర్ 1 నుంచి రైతులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు బాటసింగారంలోనే తమ లావాదేవీలను కొనసాగించాలి. – కందాడి ముత్యంరెడ్డి, చైర్మన్
బాటసింగారంలోనే పండ్ల మార్కెట్
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్క్‌కు తరలిస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి అక్కడ సేవలు మొదలవుతాయి. నూతనంగా ఏర్పాటవుతున్న మార్కెట్లో అనేక వసతులు కల్పిస్తున్నాం. గడ్డి అన్నారం మార్కెట్లో అనేక ఇబ్బందులు ఉండేవి. బాటసింగారంలో సేవలు మొదలు కాగానే ఆర్టీసీ బస్సులతో పాటు కార్గో సేవలను అందుబాటులోకి తెస్తాం. వ్యాపారులతో పాటు సాధారణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోక్తంగా ఉంటుంది. పద్మ హర్ష , గడ్డిఅన్నారం
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

