పేదింటి ఆడబిడ్డల కోసం ఉచితంగా ఫంక్షన్ హాల్
నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం ఏసీ ఫంక్షన్‌హాలులో ధనికులకు ధీటుగా ఉచితంగా జరుపుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తలచారు. అనుకున్నదే తడవుగా మొదట్లో రేకులషెడ్డుతో ఫంక్షన్‌హాలును నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ... ఎమ్మెల్యే గోపీనాథ్ అందుకు నిరాకరించారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి కోసం ఏసీ ఫంక్షన్‌హాలును నిర్మించాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేశారు.
- రూ.2.65 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాలు నిర్మాణం
- హెచ్ఎఫ్నగర్లో వేగంగా కొనసాగుతున్న పనులు
- పేదల శుభకార్యాలకు ప్రభుత్వం ఇచ్చే కానుక
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
వెంగళరావునగర్, సెప్టెంబర్ 26 : నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం ఏసీ ఫంక్షన్‌హాలులో ధనికులకు ధీటుగా ఉచితంగా జరుపుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తలచారు. అనుకున్నదే తడవుగా మొదట్లో రేకులషెడ్డుతో ఫంక్షన్‌హాలును నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా … ఎమ్మెల్యే గోపీనాథ్ అందుకు నిరాకరించారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి కోసం ఏసీ ఫంక్షన్‌హాలును నిర్మించాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేశారు.
ఉచితంగా ఏసీ ఫంక్షన్‌హాలు
రహ్మత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్లో ఎకరంన్నర ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏసీ మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాలును నిర్మించేందుకు ఎమ్మెల్యే రూ.2.65 కోట్లు మంజూరు చేశారు. ఇందులో సుమారు 1000 మందికి సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. 1575 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫంక్షన్ హాలును నిర్మిస్తున్నారు. 1250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డైనింగ్ హాల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఫంక్షన్హాల్లో సెంట్రల్ ఏసీని అమర్చుతున్నారు. వధూవరులు, బంధువుల కోసం రెండు ప్రత్యేక రూమ్‌లను నిర్మిస్తున్నారు. వివాహ వేడుకలకు కార్లు, ద్విచక్ర వాహనాలతో వచ్చేవారికి పార్కింగ్ వసతి కల్పించారు.
అన్ని వర్గాల ప్రజలకు వరం..
అన్ని వర్గాల ప్రజలకు ఈ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాలు వరంగా మారనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంత అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న సుందరమైన ఉచిత ఫంక్షన్‌హాలు లేదు. బోరబండ, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, కార్మికనగర్, శ్రీరామ్గర్, ఎస్పీఆర్ హిల్స్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఈ ఫంక్షన్‌హాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Hyd9
పేదల కోసం ఫంక్షన్ హాలు..
పేద ప్రజల కోసం అత్యాధునిక వసతులతో ఫంక్షన్‌హాలు నిర్మించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి డివిజన్లో రెండు ఫంక్షన్ హాల్స్‌ను నిర్మించాలని భావించా. సువిశాలంగా ఎకరంన్నర ఖాళీ ప్రభుత్వ స్థలంలో మల్టీ పర్పస్ ఏసీ ఫంక్షన్ హాలును నిర్మిస్తున్నా. ఇక్కడ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లతో పాటు అన్ని శుభకార్యాలకు ఈ ఫంక్షన్‌హాలును ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నా. ఫంక్షన్ హాలు ఉపయోగించుకునేవారు కనీస విద్యుత్తు చార్జీలకయ్యే ఖర్చును చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫంక్షన్హాలుకు అవసరమైన ఫర్నీచర్, వంట సామగ్రి, లైటింగ్ తదితర వాటిని నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నా. ఈ ఫంక్షన్‌హాలును అధునాతనంగా నిర్మించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. రహ్మత్‌నగర్ పరిసర ప్రాంతంలో పేదలు జరుపుకునే శుభకార్యాల కోసం ఒక్క ఫంక్షన్‌హాలు కూడా ఇప్పటి వరకు లేదు. పేదల కోసం ఏసీ ఫంక్షన్‌హాలు నగరంలో మరెక్కడా లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఈ ఫంక్షన్‌హాలు ఎంతో ప్రయోజనకరం ఉంటుంది.
– మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

