Fake Officer Arrest | సీఎంవో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Fake Officer Arrest | తెలంగాణ ముఖ్యమంత్రి పబ్లిసిటీ సెల్లో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పోట్రోకాల్ ఆఫీసర్ పేరుతో పలువురికి ఉద్యోగాలను ఇప్పిస్తానని, ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్‌ను రీ అసైన్డ్ చేయిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు.
Fake Officer Arrest | తెలంగాణ ముఖ్యమంత్రి పబ్లిసిటీ సెల్లో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని వనస్థలీపురానికి చెందిన అత్తిలి ప్రవీణ్‌సాయి పోట్రోకాల్ ఆఫీసర్ పేరుతో పలువురికి ఉద్యోగాలను ఇప్పిస్తానని, ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్‌ను రీ అసైన్డ్ చేయిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు. అలాగే, హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్‌తో ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు.
ఉద్యోగాలతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ అమాయకుల డబ్బులు సైతం వసూలు చేశాడు. గత ఆరు నెలలుగా పైరవీల పేరుతో పలువురిని మోసం చేయగా.. శనివారం ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కారు, మొబైల్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నిందితుడి వద్ద లెటర్ హెడ్స్‌ను సైతం పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

