తుక్కు ఆటోకు ఫిట్నెస్ !
శవానికి వైద్యం చేసినట్టు స్క్రాప్‌నకు వెళ్లే ఆటోకు ఫిట్నెస్ ఎందుకని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించే ఆటోకు ఫిట్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అదే ఆటో 15 ఏండ్లు పూర్తి చేసుకొని స్క్రాప్(తుక్కు)కు వెళ్లడానికి ఆర్టీఏకు దరఖాస్తు చేసుకుంటే ఫిట్నెస్ ఉండాలనే నిబంధనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- నిబంధన ఎత్తివేయాలని డిమాండ్
సిటీబ్యూరో, మే 12 ( నమస్తే తెలంగాణ ): శవానికి వైద్యం చేసినట్టు స్క్రాప్‌నకు వెళ్లే ఆటోకు ఫిట్నెస్ ఎందుకని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించే ఆటోకు ఫిట్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అదే ఆటో 15 ఏండ్లు పూర్తి చేసుకొని స్క్రాప్(తుక్కు)కు వెళ్లడానికి ఆర్టీఏకు దరఖాస్తు చేసుకుంటే ఫిట్నెస్ ఉండాలనే నిబంధనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండి డొక్కై పూర్తిగా పనికిరానిదిగా మారిందనే కారణంతో డ్రైవర్ తన ఆటోను స్క్రాప్‌నకు ఇచ్చి అదే నంబర్‌పై మరో కొత్త ఆటో కొనుగోలు చేసుకునే వీలుంటుంది. ఇలాంటి సమయంలో స్క్రాప్‌నకు వెళ్లే డ్రైవర్‌కు ఫిట్నెస్ చార్జీలు అదనంగా రూ.3వేల వరకు భారం మోయాల్సి వస్తోంది. దీంతో స్క్రాప్ చేసే వాహనాలకు ఫిట్నెస్ లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని వాహన కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సాధారణంగా ఏ వాహనానికైనా కాల పరిమితి 15 ఏండ్లు. అనంతరం తుక్కు చేసుకోవాలి లేదా గ్రీన్ ట్యాక్స్ చెల్లించి మరో ఐదేండ్లకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆటోకు మాత్రం ఫిటెనెస్ అడుగుతున్నారు. ఈ విధానంపై టీఏడీఎస్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి మాట్లాడుతూ.. తుక్కుగా మారే ఆటోలకు ఫిట్నెస్ అవసరం లేదన్నారు. పనికిరాని ఆటోకు ఫిట్నెస్ చేయిస్తే దానివల్ల ఏం లాభం అని ప్రశ్నించారు. అనవసరంగా ఆటో డ్రైవర్లపై అదనపు భారం పడుతుందని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

