పేలిన వాషింగ్ మిషన్
ఇటీవల అమీర్‌పేటలోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలిన ఘటనలో ఎల్జీ వాషింగ్ మిషన్ కంపెనీపై ఎస్ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని కేకే ఎన్‌క్లేవ్‌లో గల 503వ నంబర్ ఫ్లాట్‌లో నివసించే వి.సుందర్ రామశాస్త్రి ఇంట్లో ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మిషన్ పేలిపోయిన విషయం తెలిసిందే.
- ఎల్జీ కంపెనీపై కేసు నమోదు
వెంగళరావునగర్, నవంబర్ 30 :ఇటీవల అమీర్‌పేటలోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలిన ఘటనలో ఎల్జీ వాషింగ్ మిషన్ కంపెనీపై ఎస్ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని కేకే ఎన్‌క్లేవ్‌లో గల 503వ నంబర్ ఫ్లాట్‌లో నివసించే వి.సుందర్ రామశాస్త్రి ఇంట్లో ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మిషన్ పేలిపోయిన విషయం తెలిసిందే.
అదృష్టవశాత్తు ఘటనలో ఎవరికీ ఏమీ కానప్పటికీ, జరిగిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఎల్జీ కష్టమర్ కేర్‌కు సమాచారం అందించారు. అయినప్పటికీ ఎల్జీ కస్టమర్ కేర్ విభాగం స్పందించకపోవడంతో ఎస్ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోపాలున్న వాషింగ్ మిషన్‌ను తమకు విక్రయించారని, దీంతో ప్రమాదం జరిగిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఎల్జీ వాషింగ్ మిషన్ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

