e వాహనాలతో.. ఈజీగా బిజినెస్
ఐస్‌క్రీమ్ పార్లర్స్, బేకరీ, టిఫిన్ సెంటర్స్, మీల్స్, కూరగాయలు.. ఇలా అన్నీ ఇప్పుడు వాహనాల్లోనే కొలువుదీరుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలు.. కూడళ్లను ఎంచుకుని వ్యాపారులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వాహనాల్లోనే అంతా వ్యాపార సామగ్రిని ఏర్పాటు చేసుకుని విక్రయానికి సిద్ధమవుతున్నారు
టిఫిన్స్, బేకరీ, ఐస్‌క్రీమ్ పార్లర్స్, మిల్క్ దుకాణాలుగా వాహనాలు
నగరంలో రద్దీగా ఉండే కూడళ్లు,కాలనీల్లో వ్యాపారం
పెట్రోల్, డీజీల్ ధరల బాధ లేదు
సిటీబ్యూరో, మే 26 ( నమస్తే తెలంగాణ ) : ఐస్‌క్రీమ్ పార్లర్స్, బేకరీ, టిఫిన్ సెంటర్స్, మీల్స్, కూరగాయలు.. ఇలా అన్నీ ఇప్పుడు వాహనాల్లోనే కొలువుదీరుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలు.. కూడళ్లను ఎంచుకుని వ్యాపారులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వాహనాల్లోనే అంతా వ్యాపార సామగ్రిని ఏర్పాటు చేసుకుని విక్రయానికి సిద్ధమవుతున్నారు. కాగా, వాహన ఆధారిత వ్యాపారాలన్నింటికీ వ్యాపారులు ‘ఈ’ వాహనాలనే ఎంచుకోవడం విశేషం. పెట్రోల్, డీజిల్ ధరల బాధలు లేని ఈ వాహనాలకు మెయింటెనెన్స్ ఖర్చు కూడా పెద్దగా ఉండకపోవడంతో చాలా మంది ఈ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీదారులు చెబుతున్నారు.
చాలా మంది వ్యాపార నిర్వహణకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. మౌలాలికి చెందిన నాగేందర్ ఓ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొనుగోలు చేశాడు. అందులో మిల్క్ ప్రొడక్ట్స్‌ను తీసుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ విక్రయిస్తుంటాడు. గతంలో ఇదే వ్యాపారాన్ని పెట్రోల్ ఆధారిత వాహనంలో చేసేవాడు. దానివల్ల అతనికి వాహన మెయింటనెన్స్ పేరు మీద నెలకు రూ.6 వేల వరకు ఖర్చు వచ్చేది. ఫలితంగా వ్యాపార ఖర్చులు పోగా మిగులు ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. ఎలక్ట్రికల్ వెహికిల్ కొనుగోలు చేశాక.. పెట్రోల్, డీజిల్ ఖర్చులు లేవు. వాహన మెయింటెనెన్స్ కూడా పెద్దగా లేదు. కేవలం విద్యుత్ చార్జీ. ఒక్కసారి చార్జింగ్ పెడితే కనీసం 70 నుంచి 90 కిలోమీటర్ల వరకు వస్తుంది. 70 శాతం వాహన ఖర్చులు మిగులుతున్నాయని ఆనందం వ్యక్తం చేశాడు. మలక్‌పేటకు చెందిన నవీన్ కూడా ఎలక్ట్రిక్ వాహనంపైనే ఐస్‌క్రీం పార్లర్ ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇలా చాలా మంది వ్యాపార అవసరాల కోసం ఎలక్ట్రికల్ వెహికిల్స్‌ను వినియోగిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలే ఉత్తమం
ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుపై విజయ డెయిరీ వాళ్లు సబ్సిడీ ఇచ్చారు. పాలపాకెట్ల ఉత్పత్తులను విక్రయించడానికి ఈ వాహనాన్ని వినియోగిస్తున్నాను. పెట్రోల్ ఖర్చులు లేవు. చార్జింగ్ ఒక్కసారి ఫుల్‌గా పెడితే మూడు రోజులు వస్తుంది. నెలకు వాహన ఖర్చులు రూ. 2 వేల వరకు ఆదా అవుతున్నాయి. కాలనీల్లో తిరుగుతున్న సమయంలో కూడా ట్రాఫిక్ కారణంగా పెట్రోల్ ఎక్కువగా ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ బాధ లేదు.
– నాగేందర్, వ్యాపారి
ఎక్కడైనా చార్జింగ్ పెట్టుకోవచ్చు
పెట్రోల్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వెహికిల్స్ చాలా నయం. వ్యాపారాలు చేసుకునే వారికి చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది. పెద్దగా రిపేర్ ఖర్చులు ఉండవు. పెట్రోల్ ఖర్చులు లేవు. ఎక్కడైనా చార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీని రీమూవ్ చేసి ఇంట్లో చార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. మరొక వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నాను.
– కె. నవీన్ కుమార్, మౌలాలి
కోరుకున్నట్టుగా డిజైన్ చేస్తాం
వ్యాపారానికి ఎలక్ట్రిక్ వాహనాలను డిజైన్ చేయాలని చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. మేం వ్యాపారానికి తగ్గట్టు వారికి నచ్చిన రీతిలో డిజైన్ చేసి అందిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరగడానికి అన్ని విధాల భరోసానిస్తుంది. అనేక రాయితీలు కల్పించింది.
– సురేందర్, చైర్మన్, ఈరైడ్ కంపెనీ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

