దాతలు ముందుకురావాలి

తెలుగుయూనివర్సిటీ, జూన్ 13. దానం చేసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కష్టకాలంలో ప్రజలకు తమకు తోచిన సహాయం చేసి తమలోని దాతృత్వ గుణం చాటుకోవాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర కేవీ రమణాచారి పిలుపునిచ్చారు. రెడ్‌హిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రసరంజని వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కరోనా కష్టకాలంలో పలువురు పాత్రికేయులకు నగదు పురస్కారాలను అందజేశారు. నాటక ప్రదర్శనలతో వార్షికోత్సవాన్ని జరుపుకునే రసరంజని గత రెండు సంవత్సరాలుగా లాక్డౌన్ నేపథ్యంలో పాత్రికేయులకు నగదు పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమని రమణాచారి అన్నారు. ఈ సందర్బంగా ప్లాంజేరి ఫౌండేషన్ సౌజన్యంతో జానపద కళాకారులకు వాయిద్య పరికరాలు, నగదు పురస్కారాలు, నిత్యావసర సరుకులను రమణాచారి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ ప్లాంజేరి, భారత్ వికాస్ పరిషత్తు అధ్యక్షులు అశ్విని సుబ్బారావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Dr. KV Ramanachary
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

