సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

మియాపూర్ , జూలై 21 : కుటుంబ కలహాలతో ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ ఎస్ఐ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ర్టానికి చెందిన ఠాకూర్ శంకర్ (26) 2017 బ్యాచ్‌కు చెందిన సీఆర్ఎఫ్ కానిస్టేబుల్. వరంగల్‌లోని బెటాలియన్ 58కు కేటాయించబడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండాలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రభుత్వ స్థలం రక్షణ విధుల నిమిత్తం 45రోజుల కిందట విధుల్లో చేరాడు. ఇదిలా ఉండగా 2008లో సొంత రాష్ర్టానికి చెందిన జాగృతితో శంకర్‌కు వివాహం జరిగింది.
వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన శంకర్ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో బుధవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గొంతు వద్ద కాల్చుకున్నాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతోనే శంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు క్యాంపు ఇన్చార్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్చంద్రక సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- CRPF constable
- Shot dead
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

