Coronavirus | తెలంగాణలో కరోనా కలకలం.. హైదరాబాద్‌లో కొవిడ్ కేసు నమోదు
Coronavirus | తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఏపీలోనూ కరోనా వైరస్ విస్తరిస్తున్నది. అక్కడ రెండు కేసులు నమోదయ్యాయి. తొలుత వైజాగ్ మద్దెలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చలిజ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షల్లో కొవిడ్ 19గా తేలింది.. అలాగే నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!