మారేడ్‌పల్లి తహసీల్దార్ సస్పెండ్
మారేడ్‌పల్లి తహసీల్దార్ పద్మ సుందరిపై వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం మారేడ్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- గిర్దావర్, రికార్డు అసిస్టెంట్ సైతం..
సిటీబ్యూరో, జూన్ 20 ( నమస్తే తెలంగాణ) : మారేడ్‌పల్లి తహసీల్దార్ పద్మ సుందరిపై వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం మారేడ్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో తహసీల్దార్ అందుబాటులో లేరు. వివిధ సేవల కోసం వచ్చిన ప్రజలు ఆరు బయట తహసీల్దార్ కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడున్న అధికారులను అడిగినా తమకు తెలియదని చెప్పారు. రికార్డు రిజిస్టర్లు సైతం గందరగోళంగా ఉన్నాయి.
మారేడ్‌పల్లిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన శత్రు భూములు ఉన్నాయి. అందులో చాలా భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తుండాలి. కానీ తహసీల్దార్ ఈ రికార్డుల పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు వివిధ సేవల కోసం వచ్చిన ప్రజలను సైతం నిర్ణీత సమయంలో పనులు చేయకుండా తిప్పలు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేసి పలు రికార్డులను పరిశీలించడంతో పాటు అక్కడి వ్యవహారాన్ని తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌తో పాటు గిర్ధ్దావర్ పి.ప్రసన్న లక్ష్మి, రికార్డు అసిస్టెంట్ ఎస్.రవిలను సైతం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

