కుస్తీ పట్టి..పతకాలు కొట్టి..

- జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన నగర విద్యార్థులు
- మూడేండ్లుగా కేవీబీఆర్లో శిక్షణ
- బిహార్‌లో జరిగే జాతీయ పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం
- జాతీయ స్థాయిలోనూ మెరిసేందుకు ‘కుస్తీ’ పట్లు..
జూబ్లీహిల్స్, డిసెంబర్ 8: అందరిలాగే ఆ విద్యార్థులు పాఠశాలలకు వెళ్తూనే విరామ సమయంలో కుస్తీలో ‘పట్టు’ సాధించారు. అనతికాలంలోనే జిల్లా, రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు అందుకున్న ఆ చిచ్చర పిడుగులు జాతీయ క్రీడా యవనికపై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో కోచ్ క్యాతం శ్రీకాంత్ యాదవ్ వద్ద శిక్షణ పొందుతున్న అండర్ -15 సబ్ జూనియర్ బాలికల 38 కేజీల విభాగంలో పూజ, 58 కేజీల విభాగంలో హరిప్రియ, కీర్తన యాదవ్ (62 కేజీ), జాహ్నవి యాదవ్ (68 కేజీ), బాలుర 65 కేజీల విభాగంలో లిఖిత్ రాథోడ్‌లు బంగారు పతకాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విద్యార్థులు డిసెంబర్ 12 నుంచి 17 వరకు బిహార్‌లోని భోజ్‌పూర్‌లో జరగనున్న ఆలిండియా అండర్ -15 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆ పోటీల్లోనూ సత్తా చాటేందుకు ‘కుస్తీ’ పడుతున్నారు.
తండ్రికి తగ్గ తనయ..
ఎర్రగడ్డకు చెందిన బి.శంకర్లాల్నగర్కు చెందిన చంద్రకాంత్ వస్తాద్ నాంపల్లిలోని రతన్లాల్సింగ్ వస్తాద్ వ్యాయామ శాలలో ఖలీఫాగా కుస్తీ నేర్పిస్తుంటాడు. పగలు పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ సాయంత్రం ఔత్సాహిక క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంటాడు. తన ఆశయాన్ని సాధించేందుకు తన కూతురు పూజకు చిన్ననాటి నుంచే కుస్తీలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పూజ ప్రతిరోజు సాయంత్రం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో కోచ్ శ్రీకాంత్ యాదవ్ వద్ద శిక్షణ పొందుతున్నది. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జాతీయ స్థాయిలో పతకం సాధిస్తానని ఆ విద్యార్థి ఘంటాపథంగా చెబుతున్నది.
జాతీయ స్థాయిలోసత్తా చాటుతా..
కుస్తీ పోటీల్లో జాతీయ పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. నేను ఎర్రగడ్డ మోతీనగర్‌లోని డాన్‌బాస్కో స్కూల్లో పదో తరగతి చదువుతున్నా. మూడున్నర సంవత్సరాలుగా కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించనట్లే జాతీయ స్థాయిలో సత్తా చాటి పతకం సాధిస్తా.
-జాహ్నవి యాదవ్
అదే నా లక్ష్యం..
జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో సత్తా చాటాలన్నదే నా లక్ష్యం. శ్రీనగర్ కాలనీలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న నేను మూడు సంవత్సరాల నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు సాధించడం ఆనందంగా ఉంది. జాతీయ స్థాయిలో సత్తా చాటి పతకం సాధిస్తా.
తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేరుస్తా..
రెజ్లింగ్‌లో నేషనల్ స్థాయికి వెళ్లడం ఎంతో సంతోషంగా ఉంది. ఎర్రగడ్డలో మోతీనగర్‌లోని డాన్‌బాస్కో స్కూల్లో పదో తరగతి చదువుతున్నా. మూడు ఏండ్లుగా కేవీబీఆర్లో శిక్షణ పొందుతున్నా. కుస్తీ పోటీల్లో గొప్పస్థానంలో ఉండాలన్నది నా తల్లిదండ్రులు కోరిక. వారి ఆశయాన్ని తప్పక నెరవేరుస్తా.
- హరిప్రియ
కోచ్ పేరు నిలబెడుతా..
రెజ్లింగ్‌లో ఫ్రీ ైస్టెల్ అంటే నాకు చాలా ఇష్టం. కేవీబీఆర్లో కోచ్ శ్రీకాంత్ యాదవ్ వద్ద శిక్షణ పొందుతున్నా. ప్రస్తుతం కొండాపూర్‌లోని ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 9 వ తరగతి చదువుతున్నా. జాతీయ స్థాయిలో పతకం సాధించి కోచ్ పేరు నిలబెడుతా. - కీర్తన యాదవ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

