Maganti Sunita | నా సంగతి చెప్తామని బెదిరిస్తున్నారు : మాగంటి సునీత
Maganti Sunita | కాంగ్రెస్ పార్టీ వాళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చి ‘రేపు నీ సంగతి చెప్తాం’ అంటూ బెదిరించారని అన్నారు.
Maganti Sunita : కాంగ్రెస్ పార్టీ వాళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చి ‘రేపు నీ సంగతి చెప్తాం’ అంటూ బెదిరించారని అన్నారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని అడ్డుకోవాలంటే కేసీఆర్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని సునీత ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదని విమర్శించారు. పోలీసులు బీఆర్ఎస్ ఏజెంట్ల దగ్గర నుంచి టేబుల్స్, చైర్లు లాక్కుని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.
బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులకు మాగంటి సునీత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారని మండిపడ్డారు. నా భర్త ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ఇంతటి దౌర్జన్యాన్ని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.
ఈ రౌడీ రాజ్యానికి అడ్డుకట్ట వేయాలంటే ఓటర్లందరూ బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మాగంటి సునీత కోరారు. పోలింగ్‌కు ఇంకా నాలుగు గంటల సమయం ఉందని, దయచేసి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 13వ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండని, 14న తాను గెలిచాక అందరి సంగతి చెప్తానని ఆమె హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

