MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా అరెస్టు చేయడంపై శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కవిత అరెస్టు అక్రమమంటూ..ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు బంజారాహిల్స్ రోడ్ నం.
14లోని కవిత ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డితో పాటు కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. కవితను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి..చెదరగొట్టారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ కవితను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు.