హిమాయత్‌సాగర్‌లో దూకేందుకు యత్నించిన వివాహిత
Rajendra nagar | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకడానికి యత్నించిన ఓ వివాహిత, ఆమె ఇద్దరు పిల్లలను రాజేంద్ర నగర్ ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి కాపాడారు. భర్తతో గొడవ పడి
రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకడానికి యత్నించిన ఓ వివాహిత, ఆమె ఇద్దరు పిల్లలను రాజేంద్ర నగర్ ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి కాపాడారు. భర్తతో గొడవ పడి తన ఇద్దరు పిల్లలతో హిమాయత్ సాగర్ చెరువు వద్దకు ఓ మహిళ చేరుకుంది. పిల్లలతో కలిసి చెరువులో దూకడానికి ప్రయత్నించిన మహిళను చూసి చెరువు వద్దకు ట్రాఫిక్ పోలీసులు పరుగులు తీశారు.
మహిళను, ఇద్దరు పిల్లలను ట్రాఫిక్ సిబ్బంది వెనక్కి లాగేశారు. అనంతరం వారిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. వివాహిత బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కుర్మమ్మగా గుర్తించారు. చిన్నారులు జశ్విత, జస్వంత్ అని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ చేసి, ఇంటికి పంపించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

