ఎస్సై కాలర్ పట్టుకున్న మహిళ
చెత్త వేస్తున్నారంటూ ఎదురింటి వారిచ్చిన ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రాహుల్‌దేవ్ కథనం ప్రకారం.. ఓల్డ్ అల్వాల్ గణేశ్ ఎన్క్లేవ్ నివాసులు వెంకటేశ్వరరావు, శిల్ప దంపతులు. వెంకటేశ్వర రావు ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
- భార్యాభర్తల అరెస్టు
మల్కాజిగిరి, జూలై 11: చెత్త వేస్తున్నారంటూ ఎదురింటి వారిచ్చిన ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రాహుల్‌దేవ్ కథనం ప్రకారం.. ఓల్డ్ అల్వాల్ గణేశ్ ఎన్క్లేవ్ నివాసులు వెంకటేశ్వరరావు, శిల్ప దంపతులు. వెంకటేశ్వర రావు ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటి ఎదురుగా పవన్ ఇల్లు ఉంది. పవన్ గోడ వద్ద వీరు చెత్త వేస్తున్నారు. చెత్త వివాదం ప్రతిరోజూ ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతోంది. విసిగిపోయిన వవన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్సై సురేశ్ ఇరు కుటుంబాలను బుధవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి గొడవ పడొద్దంటూ సూచించారు. దీంతో వెంకటేశ్వరరావు దంపతులు ఆవేశానికిలోనై ఎస్సై సురేశ్‌పై అసభ్యపదజాలంతో దూషించారు. ఎస్సై వారిని వారిస్తు.. మీపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని సూచించాడు. శిల్ప కోపంతో ఎస్సై కాలర్ పట్టుకుంది. భార్యాభర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

