Ugadi Panchangam 2024 | వృశ్చికం
ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పై అధికారుల మన్ననలు అందుకుంటారు. సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు. సంయమనంతో వ్యవహరిస్తే విజయం మీదే.
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 8 వ్యయం: 14
రాజపూజ్యం: 4 అవమానం: 5
చైత్రం: ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పై అధికారుల మన్ననలు అందుకుంటారు. సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు. సంయమనంతో వ్యవహరిస్తే విజయం మీదే.
వైశాఖం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విషయాల్లో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి.
జ్యేష్ఠం: పనులు మొదట్లో మందకొడిగా సాగినా, సకాలంలో పూర్తవుతాయి. పట్టువిడుపులతో ప్రయోజనం పొందుతారు. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. భూములు, వాహనాల మూలంగా పనులు నెరవేరుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నెలాఖరులో అభీష్ట సిద్ధి.
శ్రావణం: ఈ నెలలోనూ అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.
భాద్రపదం: మొదలుపెట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉంటారు.
ఆశ్వీయుజం: ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పనుల్లో జాప్యం ఉండదు. మాసాంతంలో ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది.
కార్తీకం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలు, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి.
మార్గశిరం: ఉద్యోగులకు అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో ఉత్సాహంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూలం.
పుష్యం: ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
మాఘం: అనవసరమైన ఆలోచనలతో ఒత్తిడికి గురవుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కొత్త ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది.
ఫాల్గుణం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యస్థలంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
ఈ రాశివారికి గురువు ఆరింట (ఏప్రిల్31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా సప్తమంలో ఉంటాడు. నాలుగింట శని, ఐదింట రాహువు, లాభంలో కేతువు సంచరిస్తారు. గురువు, కేతువు పూర్తి అనుకూల ఫలితాలు ఇస్తారు. శని, రాహువు ప్రతికూలంగా ఉన్నారు. శివుడు, దుర్గాదేవి ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

