Ugadi Panchangam 2024 | తుల
ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మాసాంతంలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పదోన్నతి, స్థాన చలన సూచన.
చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 1 అవమానం: 5
చైత్రం: ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మాసాంతంలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పదోన్నతి, స్థాన చలన సూచన.
వైశాఖం: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. స్నేహితులతో వాదనకు దిగకండి.
జ్యేష్ఠం: ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పాతబాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. ఉద్యోగులు అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మాసాంతంలో పుంజుకుంటారు.
ఆషాఢం: ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భూ లావాదేవీల్లో సత్ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణాది పనులు చేపడతారు. కొత్త వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: ప్రయాణాల మూలంగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
భాద్రపదం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆశ్వీయుజం: పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పనులలో నిమగ్నమై ఉంటారు.
కార్తీకం: ఈ నెలలో ప్రథమార్ధం కంటే మాసాంతంలో కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రణాళికతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
మార్గశిరం: కుటుంబ పెద్దలతో సఖ్యత నెలకొంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. మాసాంతంలో ఆత్మీయులతో, కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఇబ్బందులు ఉండవచ్చు.
పుష్యం: ఈ నెలలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. బాధ్యతలు నిర్వర్తించడంలో శ్రమ అధికం అవుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
మాఘం: ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. స్వయం ఉపాధిలో ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచన.
ఫాల్గుణం: సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేపడతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ప్రణాళిక బద్ధంగా పనులు నెరవేరుస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విజయం. వివాదాలకు దూరంగా ఉండండి.
ఈ రాశివారికి గురువు సప్తమంలో (ఏప్రిల్ 31), ఏడాదంతా అష్టమంలో ఉంటాడు. ఐదింట శని, ఆరింట రాహువు, వ్యయంలో కేతువు సంచరిస్తారు. శని, రాహుకేతువులు అనుకూల, గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. దత్తాత్రేయస్వామి ఆరాధనతో మేలు చేస్తుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

