Ugadi Panchangam 2024 | కన్య
ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 5
రాజపూజ్యం: 5 అవమానం: 2
చైత్రం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
వైశాఖం: అనుకున్న సమయంలో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.
జ్యేష్ఠం: ముఖ్యమైన పనులు కుటుంబ పెద్దల సహకారంతో పూర్తవుతాయి. గృహ నిర్మాణ పనులు మొదలుపెడతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనసు నిలపండి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. సహనంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.
శ్రావణం: వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. వ్యాపారులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
భాద్రపదం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
ఆశ్వీయుజం: పనులు వేగంగా పూర్తవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విహారయాత్రలు చేపడతారు. శుభకార్య ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహనిర్మాణ పనులు మొదలుపెడతారు.
కార్తీకం: ఈ నెల ప్రథమార్ధంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ద్వితీయార్ధంలో కొన్ని ఆటంకాలున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.
మార్గశిరం: వివాదాలకు దూరంగా ఉంటూ పనులు నెరవేరుస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థాన చలన సూచన.
పుష్యం: ఉద్యోగంలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిచేసే చోట అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ముందుకు రావచ్చు. జాగ్రత్త వహించండి.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి బాగుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. సాహితీవేత్తలకు గుర్తింపు లభిస్తుంది.
ఫాల్గుణం: ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో శ్రద్ధ కనబరుస్తారు. మంచి ఫలితాలను పొందుతారు.
ఈ రాశివారికి గురువు అష్టమంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా భాగ్యంలో ఉంటాడు. ఆరింట శని, సప్తమంలో రాహువు, జన్మరాశిలో కేతువు సంచరిస్తారు. గురువు, శని అనుకూల ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. దుర్గాదేవి, గణపతి ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

