Ugadi Panchangam 2024 | సింహం
ఈ నెలలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 2 వ్యయం: 14
రాజపూజ్యం: 2 అవమానం: 2
చైత్రం: ఈ నెలలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వైశాఖం: అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు రాణిస్తారు.
జ్యేష్ఠం: ఈ నెల ప్రథమార్ధం మిశ్రమంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో శుభఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
ఆషాఢం: ఈ నెల గ్రహస్థితి ఓ మోస్తరుగా ఉంది. వృథా ఆలోచనల కారణంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే, ఖర్చులు పెరుగుతాయి. అలసటకు గురవుతారు.
శ్రావణం: రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. శ్రద్ధ అవసరం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు, చికాకులు ఉంటాయి. పొదుపుపై మనసు నిలుపుతారు. ఈ నెల ద్వితీయార్ధంలో మానసిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం.
భాద్రపదం: ఈ నెలలో ప్రధాన గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకుంటారు. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది.
ఆశ్వీయుజం: పనుల్లో శ్రమకు తగ్గ విజయం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.
కార్తీకం: ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కార్య నిర్వహణలో ఏమరుపాటు తగదు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సంకల్పంతో ముందుకు వెళ్తారు.
మార్గశిరం: ప్రారంభించిన పనుల్లో మొదట్లో ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. సరైన మార్గనిర్దేశం లభిస్తుంది.
పుష్యం: ఇంటా బయటా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. నెలాఖరులో నిర్మాణాది పనులు చేపడతారు.
మాఘం: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవడం అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం. శుభకార్య నిర్వహణలో అయినవారి సహకారం లభిస్తుంది.
ఫాల్గుణం: ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు.
ఈ రాశివారికి గురువు భాగ్యంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా దశమంలో, సప్తమంలో శని, అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు సంచరిస్తారు. గురువు, శని అనుకూల, రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. దుర్గాదేవి, గణపతి ఆరాధన మేలు శుభప్రదం.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

