Hair Fall In Men | పురుషుల్లో అసలు జుట్టు ఎందుకు రాలుతుంది..? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి..?
నేటి కాలంలోపురుషులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. ముఖ్యంగా యువత ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. జుట్టు రాలడం మొదట్లో చిన్న విషయంగా కనిపించినా దీర్ఘకాలం పాటు జుట్టు రాలడం ఇలాగే కొనసాగితే బట్టతల రావడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది.
Hair Fall In Men | నేటి కాలంలోపురుషులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. ముఖ్యంగా యువత ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. జుట్టు రాలడం మొదట్లో చిన్న విషయంగా కనిపించినా దీర్ఘకాలం పాటు జుట్టు రాలడం ఇలాగే కొనసాగితే బట్టతల రావడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. కనుక జుట్టు రాలడం మొదలవ్వగానే ముందుగా మనం జుట్టు రాలడానికి గల కారణాలను తెలుసుకోవాలి. తద్వారా మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మన జీవనశైలితో పాటు జన్యుసరమైన కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జుట్టు రాలడానికి గల ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒత్తిడి, పోషకాహార లోపం..
జన్యుసరంగా కూడా కొందరిలో జుట్టు రాలుతుంది. జన్యుపరంగా బట్టతల కలిగిన ఉన్నవారు ఫోలికల్స్ డిహెచ్కి సున్నితంగా, జుట్టు పలుచగా కలిగి ఉంటారు. ఈ సున్నితత్వం ప్రతి చక్రంలో జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. జన్యుపరంగా మార్పు సాధ్యం కాదు కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీని వల్ల కొన్ని రోజులకు జుట్టు రాలడం మొదలవుతుంది. చాలా మంది ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలుతుందని భావించరు. కానీ ఒత్తిడి నిర్వహణ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. కానీ చాలా మంది పురుషులు సమయానికి భోజనం చేయక, బరువు తగ్గాలని సరైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో పోషకాలు సరిగ్గా అందక జుట్టు రాలిపోతుంది. కనుక పోషకాలు కలిగిన సరైన ఆహారాన్ని సమయానికి తీసుకోవడం చాలా అవసరం.
హార్మోన్ల అసమతుల్యత..
హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా జుట్టు రాలుతుంది. టెస్టోస్టిరాన్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. కనుక హార్మోన్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా అవసరం. కొందరు జుట్టుకు కఠినమైన షాంపూలను, జుట్టు ఉత్పత్తులను వాడతారు. ఇవి జుట్టు సహజ నూనెలను తొలగిస్తాయి. జుట్టు కుదుళ్లు బలహీనపడి క్రమంగా జుట్టు ఊడిపోతుంది. కనుక జుట్టుకు హాని కలిగించని మృదువైన ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టును స్టైల్ చేసుకోవడానికి కొందరు బ్లో డ్రైయింగ్ ను ఉపయోగిస్తారు. ఇది జుట్టుకుతీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను కదిలించడంతో పాటు జుట్టు విరిగిపోయేలా చేస్తుంది. కనుక జుట్టును తేలికగా స్టైల్ చేసుకోవడం మంచిది. అలాగే తలచర్మం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అపరిశుభ్రంగా ఉండే తలచర్మం జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. కనుక తలచర్మం శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. ధూమపానం, మద్యపానం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇవి శరీరానికి శక్తి తగ్గేలా చేస్తాయి. దీంతో పోషకాలు సరిగ్గా అందక జుట్టు రాలుతుంది. కనుక ఈ రెండింటికి దూరంగా ఉండడం చాలా అవసరం. ఇలా అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుందని జుట్టు రాలడానికి గల కారణాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

