నాన్ స్టాప్ శృంగారం : ఇటలీ టూరిస్ట్ అత్యుత్సాహంతో ఏమైందంటే..!
డ్రగ్స్ తీసుకుని ఏకంగా 24 గంటల పాటు శృంగారంలో పాల్గొన్న వ్యక్తి పురుషాంగాన్ని వైద్యులు తొలగించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రోజంతా నిరంతరాయంగా శృంగారంలో మునిగితేలడంతో జర్మనీకి చెందిన వ్యక్తి (50) ఇటలీలోని గ్రసెటో ఆస్పత్రిలో తీవ్ర అస్వస్ధతకు లోనయ్యాడు.
రోమ్ : డ్రగ్స్ తీసుకుని ఏకంగా 24 గంటల పాటు శృంగారంలో పాల్గొన్న వ్యక్తి పురుషాంగాన్ని వైద్యులు తొలగించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రోజంతా నిరంతరాయంగా శృంగారంలో మునిగితేలడంతో జర్మనీకి చెందిన వ్యక్తి (50) ఇటలీలోని గ్రసెటో ఆస్పత్రిలో తీవ్ర అస్వస్ధతకు లోనయ్యాడు. ఇటలీలో హాలిడేను ఆస్వాదిస్తున్న వ్యక్తి అత్యుత్సాహంతో చేసిన పనికి మే 11న మిసెరికార్డియా ఆస్పత్రిలో చేరాడు.

కాస్టెల్ డెల్ పియానోలోని తమ అపార్ట్మెంట్లో భార్యాభర్తలు ఎక్టసీ డ్రగ్ తీసుకుని లవ్ మారథాన్‌లో పాల్గొనడం వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ఆస్పత్రిలో చేరిన వారం రోజుల తర్వాత అతడి పరిస్ధితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడికి సెప్టిక్ షాక్ రావడంతో పురుషాంగం దెబ్బతిందని చెబుతున్నారు.
కాగా కణితి లేకపోయినా ఓ రోగి పురుషాంగాన్ని తొలగించినందుకు ఇటలీలోని ఓ యూరాలజిస్ట్ విచారణను ఎదుర్కొంటున్నాడు. 2018లో టస్కనీ ప్రాంతానికి చెందిన గుర్తుతెలియని రోగికి తీవ్ర గాయం చేశాడని ఆయనపై అభియోగాలున్నాయి. బాధిత వ్యక్తి (68) ప్రస్తుతం 35 ఏండ్ల సర్జన్‌ను కోర్టు కీడ్చుతూ భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాను పురుషాంగం కోల్పోవడంతో పాటు మానసిక వ్యధను అనుభవించానని తాను పరిహారం పొందేందుకు అర్హుడినని రోగి చెప్పుకొచ్చారు.
Read More
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

