క్యాన్సర్‌పై పోరాటం
సోనాలి శృంగారం.. పన్నెండేండ్లు కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నారు. స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. కుటుంబ సమస్యల కారణంగా యూకే నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఆ సమయానికి.. బంధుమిత్రుల్లో చాలామంది క్యాన్సర్ రోగులే. తరచూ మరణ వార్తలే. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. అప్పుడే, క్యాన్సర్ రోగులకు సాయం అందించేలా ఓ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నారు.
సోనాలి శృంగారం.. పన్నెండేండ్లు కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నారు. స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. కుటుంబ సమస్యల కారణంగా యూకే నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఆ సమయానికి.. బంధుమిత్రుల్లో చాలామంది క్యాన్సర్ రోగులే. తరచూ మరణ వార్తలే. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. అప్పుడే, క్యాన్సర్ రోగులకు సాయం అందించేలా ఓ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నారు. అలా ప్రాణం పోసుకున్నదే ‘సైఫర్ హెల్త్‌కేర్’. తన సంస్థ ఆధ్వర్యంలో సోనాలి ఓ హెల్ప్‌లైన్ ప్రారంభించారు. రెండేండ్ల పరిమితకాలంలో దాదాపు యాభైవేలమంది రోగులకు ధైర్యం అందించారు.
సరైన వైద్యశాలల్ని, చేయితిరిగిన నిపుణులనూ పరిచయం చేశారు. భాష సమస్య కాకూడదనే ఉద్దేశంతో నాలుగైదు భాషలు తెలిసిన ఎనిమిదిమంది కౌన్సెలర్లను నియమించుకున్నారు. క్రమంగా సైఫర్ క్యాన్సర్ వైద్యసేవల రంగంలోకి కూడా వచ్చింది. ‘తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మేం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించాం. ఆ సమయంలో అనేక రుగ్మతలు బయట పడ్డాయి. కుటుంబ బాధ్యతలలో పడిపోయి చాలామంది మహిళలు తమ ఆరోగ్యాల్ని కూడా పట్టించుకోవడం లేదు’ అని ఆవేదనగా చెబుతారు సోనాలి. తను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థి కూడా.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

