ఇది స్కార్లెట్ ఫీవరా?
మా పాప వయసు ఆరేండ్లు.గత మూడురోజులుగా జ్వరం ఎక్కువగా ఉంటున్నది. శరీరమంతా ఎర్రటి దద్దుర్లు. గొంతు నొప్పి ఉంది. దీంతో ఏమీ తినలేకపోతున్నది. యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ‘స్కార్లెట్ ఫీవర్' కావచ్చు అంటున్నారు. ఇది ప్రమాదకరమా? సలహా ఇవ్వగలరు.
మా పాప వయసు ఆరేండ్లు.గత మూడురోజులుగా జ్వరం ఎక్కువగా ఉంటున్నది. శరీరమంతా ఎర్రటి దద్దుర్లు. గొంతు నొప్పి ఉంది. దీంతో ఏమీ తినలేకపోతున్నది. యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ‘స్కార్లెట్ ఫీవర్’ కావచ్చు అంటున్నారు. ఇది ప్రమాదకరమా? సలహా ఇవ్వగలరు.
– ఓ పాఠకురాలు
గొంతునొప్పి, తీవ్రజ్వరం, దద్దుర్లు .. ఉన్నాయంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. గత రెండు నెలల నుంచీ స్ట్రెప్టోకొక్కై అనే బ్యాక్టీరియాతో ముడిపడిన ఈ ఇన్ఫెక్షన్ను ఎక్కువగా చూస్తున్నాం. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరాన్నే స్కార్లెట్ ఫీవర్ అని పిలుస్తారు. తీవ్ర జ్వరం, నోరు పొక్కిపోవడం, గొంతులో మంట, నాలుక ఎర్రగా కందిపోవడం (స్ట్రాబెర్రీ టంగ్),నీరసం, ఏమీ తినాలనిపించకపోవడం..
వ్యాధి లక్షణాలు. సరైన సమయంలో మంచి యాంటీ బయాటిక్ వాడితే ఏమంత ప్రమాదకరం కాదు. కొన్నిసార్లు ఒళ్లంతా వ్యాపించవచ్చు కూడా. సరైన మందులు అందకపోతే కొంతమందిలో గుండె, కిడ్నీల మీద ప్రభావం పడవచ్చు. రుమాటిక్ ఫీవర్, నెఫ్రైటిక్ సిండ్రోమ్‌లకు కూడా దారి తీయొచ్చు.
ఈ జ్వరం తర్వాత బిడ్డలో ఆయాసం, గుండెదడ, ముఖం వాచిపోవడం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో రక్తం.. మొదలైన లక్షణాలను గమనిస్తూ ఉండాలి. తేడాగా అనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. చాలా వైరల్ ఇన్ఫెక్షన్లలో.. డెంగ్యూతో పాటు దద్దుర్లు వస్తాయి. ఇలాంటప్పుడు, తప్పక పిల్లల డాక్టర్‌ను సంప్రదించాలి. అది ఏ తరహా జ్వరమో నిర్ధారించుకొని మంచి చికిత్స ఇప్పించాలి. నిర్లక్ష్యం పనికిరాదు.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- baby fever
- Fever
- High fever
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

