Health Tips | మా బాబు ఆరేండ్లు వచ్చినా ఇంకా పొట్టిగానే ఉన్నాడు.. ఇదేమైనా లోపమా ?
Health Tips | పిల్లలు పొట్టిగా ఉండటానికి కారణాలు అనేకం. కొంతమంది జన్మతః పొట్టిగానే పుడతారు. అదే క్రమంలో పెరుగుతూ పోతారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఎత్తు, బరువు మొదలైన ‘గ్రాఫ్ చార్ట్' బాగానే ఉంటే.. ఆందోళన చెందాల్సిన పన్లేదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల కూడా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది.
Health Tips | మా బాబు వయసు ఆరేండ్లు. మిగిలిన పిల్లలతో పోలిస్తే చాలా పొట్టిగా ఉంటాడు. మా వైపు కానీ, మా వారి వైపు కానీ అందరూ పొడుగే. ఆ ఒక్క లోపం మినహా, బాబు చురుగ్గానే ఉంటాడు. ఇదేమైనా లోపమా? దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?
- ఓ పాఠకురాలు
పిల్లలు పొట్టిగా ఉండటానికి కారణాలు అనేకం. కొంతమంది జన్మతః పొట్టిగానే పుడతారు. అదే క్రమంలో పెరుగుతూ పోతారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఎత్తు, బరువు మొదలైన ‘గ్రాఫ్ చార్ట్’ బాగానే ఉంటే.. ఆందోళన చెందాల్సిన పన్లేదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల కూడా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథి లోపాలు, జన్యుపరమైన పరిమితుల వల్ల ఇలా జరగొచ్చు. గుండె సమస్యలు, పేగుల రుగ్మతలు కూడా ఎదుగుదలను నిరోధిస్తాయి.
సాధారణంగా తల్లిదండ్రుల ఎత్తును బట్టి పిల్లల సగటు ఎత్తును నిర్ధారిస్తాం. దీన్నే మిడ్ పేరెంటల్ రేంజ్ అంటారు. కొన్నిసార్లు పిల్లలు మొదట్లో పొట్టిగానే ఉన్నా ఆ తర్వాత వేగంగా పెరుగుతారు. ఈ క్రమాన్ని కాన్స్టిట్యూషనల్ డిలేగా వ్యవహరిస్తారు. సమగ్ర పరీక్షల తర్వాతే ఈ సమస్యకు కారణం తెలుస్తుంది. ఒకసారి పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. పొడుగ్గా లేకపోవడం పెద్ద లోపమేం కాదు, కాకపోతే పిల్లల ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బతీస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

