Toothache | దంతాలు, చిగుళ్ల నొప్పి తీవ్రంగా ఉందా.. అయితే ఈ ఇంటి చిట్కాలను పాటించండి..!
మనలో చాలా మందికి సహజంగానే అప్పుడప్పుడు దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి.
Toothache | మనలో చాలా మందికి సహజంగానే అప్పుడప్పుడు దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంతాలు పుచ్చిపోయి అందులోకి ఆహార పదార్థాలు వెళ్లడం, చిగుళ్ల వాపులు రావడం, ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వంటి కారణాల వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి వస్తుంటాయి. అయితే ఇందుకు పలు ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు, ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారుతాయి. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు నీరు..
దంతాలు, చిగుళ్ల నొప్పిని తగ్గించడంలో ఉప్పు నీరు ఎంతగానో దోహదం చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఇలా రోజు మొత్తంలో మీకు వీలైనన్ని సార్లు చేస్తుండాలి. దీంతో దంతాలు, చిగుళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న చోట ఐస్ ప్యాక్‌ను ఉంచడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని ఐస్ ముక్కలను ఒక వస్త్రంలో చుట్టి దాంతో నొప్పి ఉన్న చోట 10 నిమిషాల పాటు కాపడం పెట్టినట్లు మసాజ్ చేయాలి. దీంతో నొప్పి తగ్గుతుంది. లవంగ నూనెను నొప్పి ఉన్న చోట రాస్తున్నా కూడా ఉపశమనం లభిస్తుంది. లవంగం నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అనాస్థటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక నొప్పి, వాపు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
లవంగం నూనె..
ఒక కాటన్ బాల్ తీసుకుని దానికి కాస్త లవంగం నూనెను రాయాలి. ఇలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కనుక ఘాటు తట్టుకోలేమని అనుకునేవారు అందులో కాస్త కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెను కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్‌కు రాసి నొప్పి ఉన్న దంతం లేదా చిగురుపై 30 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పెప్పర్ మింట్ టీ బ్యాగ్‌ను వేడి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం ఆ బ్యాగ్‌ను తీసేసి ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లార్చాలి. తరువాత ఆ మిశ్రమంలో ఒక కాటన్ బాల్‌ను ముంచి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. లేదా ఆ చోట కాటన్ బాల్‌ను 15 నిమిషాల పాటు ఉంచాలి. పెప్పర్‌మింట్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కనుక దంతాలు, చిగుళ్ల నొప్పులను ఇది తగ్గిస్తుంది.
వెల్లుల్లి..
ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని కాస్త దంచి పేస్ట్‌లా చేయాలి. దాన్ని నొప్పి ఉన్న దంతం లేదా చిగుళ్లపై 15 నిమిషాల పాటు ఉంచాలి. లేదా వెల్లుల్లిని ఆ దంతంలో అలాగే నమలాలి. అవసరం అనుకుంటే కాస్త ఉప్పు చల్లి వెల్లుల్లిని తినవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. వెల్లల్లి మరీ ఘాటుగా ఉందనుకుంటే కాస్త తేనె కలిపి వాడుకోవచ్చు. జామ ఆకులు కూడా దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొన్ని జామ ఆకులను శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని కొన్ని నిమిషాల పాటు అలాగే నమిలి ఉమ్మేయాలి. జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో కాస్త ఉప్పు కలిపి దాంతో నోటిని పుక్కిలిస్తుండాలి. ఇలా చేస్తున్నా కూడా దంతాలు, చిగుళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- toothache
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

