మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా!

“రౌడీబాయ్స్’ చిత్రాన్ని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆస్వాదిస్తున్నారు. మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం అయిన ఆశిష్‌ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయమైన ‘రౌడీబాయ్స్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకులముందుకొచ్చింది. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. సినిమాను దిల్‌రాజు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. ఆయన మాట్లాడుతూ ‘సంధ్య థియేటర్, ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో సినిమా చూశా. ప్రతి సీన్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాన్సులు, మ్యూజిక్ అద్భుతంగా ఉందంటున్నారు. అన్ని ప్రాంతాల నుంచి సినిమా బాగుందనే టాక్ వస్తున్నది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ రావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ‘మా టీమ్ అందరికి భావోద్వేగభరితమైన సందర్భమిది. మా మూడేళ్ల కష్టానికి ఫలితం లభించింది’ అని దర్శకుడు తెలిపారు. ఆశిష్ మాట్లాడుతూ ‘హీరోగా నన్ను ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. సంక్రాంతి హిట్ ఇచ్చిన దిల్‌రాజుగారికి కృతజ్ఞతలు’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

