నా కలల తెలంగాణ
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో 60 ఏండ్ల స్వరాష్ట్ర పోరాటం. సాటి తెలుగువాడే తెల్లదొరలా చెరబడుతుంటే అరిగోసలు పడ్డది నా తెలంగాణ. బంధించి బాధించినపుడు మార్జాలం కూడా గర్జించే పులిలా మారినట్టు, తిరుగుబాటు పోరాటాలకు శంఖం పూరించినట్టు
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో 60 ఏండ్ల స్వరాష్ట్ర పోరాటం. సాటి తెలుగువాడే తెల్లదొరలా చెరబడుతుంటే అరిగోసలు పడ్డది నా తెలంగాణ. బంధించి బాధించినపుడు మార్జాలం కూడా గర్జించే పులిలా మారినట్టు, తిరుగుబాటు పోరాటాలకు శంఖం పూరించినట్టు, తొలిపొద్దు ఉదయించే ఎర్రటి సూరీడు వలె ఉద్యమకారులకు ఊపిరి పోసింది నా తెలంగాణ.
నిజాం నిరంకుశత్వ పాలనకు ఎదురొడ్డి నిలిచిన దొడ్డి కొమురయ్య, దొరల పాలనకు చరమగీతం పాడుతూ, రోకలి బండను ఎత్తిన చాకలి ఐలమ్మలను గన్నది నా తెలంగాణ. పెత్తందార్ల ఎత్తులకు నెత్తురు చిందిస్తూ నేల రాలిన అమరులను స్మరిస్తూ, అనుసరిస్తూ మరుసటి ఉషోదయానికి ఉరకలెత్తిన త్యాగధనులను తన ఒడికి చేర్చుకున్నది నా తెలంగాణ.
మలిదశ ఉద్యమానికి తొలి ప్రాణార్పణ చేసిన కాసోజు శ్రీకాంతు, అంబేద్కరుడి సాక్షిగా అగ్నికి ఆహుతవుతూ ఉద్యమానికి ఆజ్యం పోసెను తనవంతు. ఒక్కడేలే తానెంత అనుకున్న బక్క మనిషి గల్లీ నుండి ఢిల్లీ దాక లొల్లిజేసి పిల్లాజెల్లను సైతం భాగం జేసి, జెండాలెన్నున్నా ఎజెండా ఒక్కటేనని పిడికిలి బిగించి దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ నిన్నూ నన్నూ ఒక్కటి చేసిన మనిషి.
ఒకనాడు ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు, నేడు మాగాణానికి కాళేశ్వరం నీళ్లు, త్రాగడానికి భగీరథ నీళ్లు. ఒకనాడు కరువు కాటకాలతో ఊళ్లన్నీ దిగులు, నేడు బంగారు తెలంగాణకు సరిపడా నిధులు. ఒకనాడు బీటలు వారిన నేలలు, నేడు ఊటలతో నిండిన కొలనులు. ఒకనాడు మోడువారిన అరణ్యం, నేడు ఆకుపచ్చని హరిత వనం.
ఒకనాడు నా తెలంగాణ, కని ముళ్లపొదల్లో పారేసిన పసికూన. నేడు, స్వేచ్ఛగా చెంగు చెంగుమని గంతులేస్తున్న లేడి కూన. ఒకనాడు నా తెలంగాణ పరాయి పాలకులకు భారం, నేడు పొరుగు రాష్ర్టాలకు ఆదర్శం.
ఒకనాడు నా తెలంగాణ ఛీత్కారం, కానీ నేడు దేశానికే నిండు గౌరవం. అందుకే, అమరుల త్యాగాలతో, అశేష జన ఉద్యమాలతో సుదీర్ఘ పోరాటపటిమతో నిండిన నా తెలంగాణ స్ఫూర్తి, ప్రపంచ దేశాలకు పతాక స్థాయి కీర్తి.
– మహేష్ తమ్మడి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

