స్వర్గసీమ
అక్కడి పలకరింపులో జీవం అక్కడి కలివిడితనం లోకవ్యవహార సిద్ధం అక్కడి మనుషుల్లో మానవతా పరిమళం పై చదువులు ఎంతదూరం నడిపించినా పైరగాలికి తలలూపే పంట చేలు లేత కొబ్బరి లాంటి తీయని వాగులు రోజుకో పేయింటింగ్‌లా పొద్దు పొడుపు గోధూళి మనసులో చెదరని చిత్రాలుగా...
అక్కడి పలకరింపులో జీవం
అక్కడి కలివిడితనం లోకవ్యవహార సిద్ధం
అక్కడి మనుషుల్లో మానవతా పరిమళం
పై చదువులు ఎంతదూరం నడిపించినా
పైరగాలికి తలలూపే పంట చేలు
లేత కొబ్బరి లాంటి తీయని వాగులు
రోజుకో పేయింటింగ్‌లా పొద్దు పొడుపు
గోధూళి మనసులో చెదరని చిత్రాలుగా…
బడి సోపతిగాళ్లు
గుడి భజనలు
చెరువులో చేపల వేట
అడవి పండ్ల యాది
పిల్లలకు పిట్ట కథలుగా…
అమ్మ చీర సింగులు పట్టి నడిచిన ఇల్లు
నాన్న అడుగులను అనుసరించి నేర్చిన ప్రకృతి పాఠం
ఉన్నతికి మూలమైన మూలం
కంటిమీద కునుకును అప్పుడప్పుడు
మాయం చేస్తున్నది.
పుట్టిపెరిగినం కదా!
స్మరణకు రాకుండా ఉండలేం!!
ఎంతిష్టమో
బాల్యపు మడుగులో మునకేసి
తనివితీరా తామర్లను తడమడమంటే.
ప్రపంచీకరణ మాయం చేసిన
ప్రతి దృశ్యం తైలవర్ణ చిత్రం.
నా ప్రయాణం నా కోసం మొదలై
మా కోసంగా మారింది.
వలసపోయిన కోయిల
వసంతంలో తిరిగొచ్చినట్టు
ఉనికిని ఉగాది తోరణంలా
ఊరిగుమ్మానికి కట్టాలి
వెళ్లిరావాలి గిట్టని ఆ నేలపైకి
పుట్టిన ఆ స్వర్గసీమకు…
-దామరకుంట శంకరయ్య , 94408 76788
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Gangadevipalli
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

