హిమజాతయునపర్ణ ఉమజయశారద
అంబిక ఈశ్వరి ఆర్యదుర్గ
శాకాంబరినగజ శర్వాణిచండిక
కాత్యాయనీ మహంకాళిగౌరి
పార్వతిజగదంబ భార్గవిరుద్రాణి
సర్వమంగళ గిరిజామృడాని
భాగ్యనగర సింహవాహినిశాంభవి
దాక్షాయణి భవాని రక్షమాకు
అనుచు భక్తజనము సాక నారగించి
పులగశాల్యోదనంబుగ బోనమెత్తి
పోతరాజుల విన్యాస పూనకాల
సాంస్కృతిక సిరిగను రాష్ట్రజాతరయ్యె.