telugu book of records | బేబీ స్వాదింతకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఉస్మానియా యూనివర్సిటీ : అతిచిన్న వయసులోనే తన అసమాన ప్రతిభతో బేబీ స్వాదింత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. లాలాపేటలోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన సుమన్, గుల్లే రేఖ కుమార్తె అయిన టీజీ స్వాదింత కేవలం 30 నెలల వయసులోనే తన నిరుమానమైన మేధస్సుతో అందరినీ ఆకట్టుకుంది.
స్కూల్ తలుపులు కూడా చూడని ఆ చిన్నారి 24 నెలల వయసులోనే ప్రపంచంలోని 195 దేశాల జెండాలను గుర్తించడంతో పాటు వివిధ జీకే ప్రశ్నలకు ఎటువంటి తడబాటు లేకుండా జవాబులిస్తోంది. శాస్త్రజ్ఞుల పరిశోధనలు, జంతువుల పేర్లు, రసాయనిక మూలకాల పేర్లు, చేతి వృత్తులు, డాక్టర్లు – వారి ప్రత్యేకతలు, పజిల్స్, కరెన్సీ నోట్లు, దేశరాజధానులు, ప్రపంచ పటంలో దేశాలను పజిల్స్ ప్రక్రియలో గుర్తించి రెండు అవార్డులను స్వంతం చేసుకుని అందరినీ అబ్బురపరిచింది.
ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ అతి చిన్న వయసులో తన జ్ఞాపిక శక్తిని ప్రదర్శించిన చిన్నారి స్వాదింత పేరును రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత ధృవపత్రం, జ్ఞాపిక, బ్యాడ్జిలను చిన్నారి తల్లిదండ్రులకు బహూకరించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

