దోషదర్శనం
దోషదర్శనం ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధాన ఆటంకం. గుణ పక్షపాతం అంటే మంచినే చూసే సుగుణం.. పారమార్థిక పురోగతికి తొలి చిహ్నం. అందుకే మహానుభావులు ఎవరిలోనూ తప్పులను ఎంచరు. పైగా లేశమాత్రంగా ఉన్న సుగుణాన్ని సైతం విశేషంగా ప్రస్తావిస్తారు.
దోషదర్శనం ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధాన ఆటంకం. గుణ పక్షపాతం అంటే మంచినే చూసే సుగుణం.. పారమార్థిక పురోగతికి తొలి చిహ్నం. అందుకే మహానుభావులు ఎవరిలోనూ తప్పులను ఎంచరు. పైగా లేశమాత్రంగా ఉన్న సుగుణాన్ని సైతం విశేషంగా ప్రస్తావిస్తారు. ఒకసారి అరుణాచలంలో దీపావళినాడు రమణుల ఆశ్రమం అంతటా దీపాలు వెలిగించారు. సాయంత్రం మహర్షి సన్నిధిలో నరకాసుర ప్రస్తావన వచ్చింది. అప్పుడు భక్తులు యాదృచ్ఛికంగా అరుణాచల పరిసరాల్లో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే విషయాన్ని రమణులకు వివరిస్తూ ‘భగవాన్! మన ఊరిలో కూడా ఓ నరకాసురుడు లాంటి వాడు చనిపోయాడు. అతను ఎన్నో నేరాలు, ఘోరాలకు పాల్పడ్డాడు.
ఇక వాడి పీడ విరగడై పోయింది. ఈ రోజు మన అరుణాచలానికి అసలైన దీపావళి’ అన్నారు. అప్పుడు మహర్షి గంభీరంగా ‘ఓహెూ అలాగా! అందరూ ఆయన గురించి చెడుగానే చెబుతున్నారే! అతనిలో ఒక్క మంచి లక్షణం కూడా లేదా! మీకు ఓ విషయం తెలుసా! ఆయన రోజూ ఉదయం సాయంత్రం రెండుసార్లు శుభ్రంగా స్నానం చేస్తాడు. అది మీకు తెలుసా?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ‘ఎప్పుడూ వ్యక్తిలోని చెడ్డ గుణాల గురించి కాదు, మంచి లక్షణాల గురించి మాట్లాడుకోవాలి. మన పురాణాల్లోని రాక్షసులందరూ దేవతల శాపాల వల్ల దురాగతంగా ప్రవర్తించారు. వారి కర్మఫలాలు తీరిపోగానే భగవంతునిలో ఐక్యమైపోయారు’ అన్నారు రమణులు. అలా ఆ దీపావళి రోజున భక్తులకు ఓ దివ్యసందేశం నేర్చుకున్నట్లయింది. అందుకే, రాముడంతటి వాడు కూడా.. రావణ సంహారం తర్వాత ‘రావణత్వాన్ని పెరికితిని, అయిననేమి రావణుని కాపాడలేకపోతిని’ అని విభీషణుడి ముందు ఆవేదన వ్యక్తం చేశాడట.
మనోజ్ఞ…?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

