పనిలో విజయం లభించినప్పుడు ‘అంతా నా గొప్పదనమే’ అని పొంగిపోకు. ‘దేవుని దయ’ అని కృతజ్ఞతతో ఉండు. అలాగే, పని సఫలం కానప్పుడు అది పనితీరు అనుకోక, కార్యాల జయాపజయాలు మానవ ప్రయత్నంతో కాక, దైవానుగ్రహంతో లభిస్తాయని గ్రహించు. జయాపజయాలు విధివిలాసం. అంతేగాని, సంకల్ప శక్తి ఉండటమో, లేకపోవడమో కాదు. అన్ని వేళలా సమతాబుద్ధిని సాధించడమే సంకల్ప సిద్ధి. దాని విజయం కూడా! సాధకుడు తోటివారి ఆదరణ, సానుభూతులకు పాత్రుడు అవుతూ ప్రపంచంలో ఉండాలి. ఇతరుల అసూయాద్వేషాలకు కాదు.
– రమణ మహర్షి