ఏదీ అడ్డంకి కాదు!
ఆధ్యాత్మిక సాధన ప్రధాన ఉద్దేశం భౌతిక విషయాలకు అతీతంగా ఎదగడం. ఈ క్రమంలో భౌతికాతీతమైనది ఏమిటో గ్రహించాలి. భౌతిక సుఖాలు, ఇష్టాఇష్టాలు, నానా రుచులు వీటన్నిటిపై మనసును కేంద్రీకృతం చేసి సాధన కొనసాగించడం కష్టమే అవుతుంది. శృంగారం వంటి శారీరక విషయాల్లో చిక్కుకుంటే సాధన మరింత దుర్లభం అవుతుంది. ఎందుకంటే, శారీరకంగా పంచుకున్న అనుభవాలు అక్కడితో ఆగిపోవు. దాని వెనుకే భావోద్వేగాలు, ఆలోచనలు అన్నీ అనుసరించి వస్తాయి. జీవితమంతా అదే నిండిపోయి సాధన కుంటుపడుతుంది.

దైనందిన జీవితంలో చేసే కర్మలకు ఆధ్యాత్మికతకు ఏ సంబంధం ఉండదు. ఆధ్యాత్మిక సాధన అంతర్గతమైంది. చేసే కర్మలు బాహ్యానికి సంబంధించినవి. ఈ రెండిటి మధ్యా అంతరాన్ని పాటిస్తే ఏ ఇబ్బందీ రాదు. అయితే, చాలామంది ఈ రెండిటి మధ్య అంతరాన్ని గుర్తించలేరు కనుక ‘దీంట్లో చిక్కుకోవద్దు, అందులో చిక్కుకోవద్దు’ అని పెద్దలు చెబుతుంటారు. శారీరక పరమైనవన్నీ అవరోధాలుగానే కనిపిస్తాయి. తినడం కావచ్చు, మాట్లాడటం కావచ్చు. శృంగారం కావచ్చు, మరేదైనా కావచ్చు! జీవితంలో అన్నీ భాగాలే. ఏ పనిలో అయినా పూర్తిగా జాగృత స్థితిలో ఉండగలిగితే, అవి సాధనకు అవరోధం కావు. దీనిని చాలామందికి అవగాహన చేసుకోలేరు కాబట్టి, సాధారణంగా ఐహిక సుఖాలకు దూరంగా ఉండమని చెబుతుంటారు. దైనందిన కర్మలను స్పృహలో ఉండి చేయగలిగితే ఏదీ బలహీనతగా మారదు. అప్పటికీ విషయ వాసనలు విడువకపోతే అందుకు కారణాన్ని తెలుసుకొని, అవగాహన చేసుకొని పరిష్కరించుకోవాలి. అప్పుడు క్రమంగా ఒక్కో బలహీనత నుంచి బయటపడవచ్చు. స్వేచ్ఛవైపు పయనం సాగిస్తారు. ఆధ్యాత్మిక పథంలో ఉన్నతస్థితికి చేరుకోగలుగుతారు.
ప్రేమాశీస్సులతో..
సద్గురు
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- alone feeling
- feeling
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

