ఏనుగు దానం
ఒక నదీ తీరాన ఓ భక్తుడు అమ్మవారి ఆలయం నిర్మించాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఉత్సవాల సమయాల్లో ఏనుగు అవసరమని భావించాడు. అది తెలుసుకున్న ఇద్దరు సంపన్నులు తమ దగ్గర ఉన్న ఏనుగులను ఆలయానికి బహూకరించాలని భావించారు. రెండు ఏనుగులను భరించడం చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు మావటీలు.
ఒక నదీ తీరాన ఓ భక్తుడు అమ్మవారి ఆలయం నిర్మించాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఉత్సవాల సమయాల్లో ఏనుగు అవసరమని భావించాడు. అది తెలుసుకున్న ఇద్దరు సంపన్నులు తమ దగ్గర ఉన్న ఏనుగులను ఆలయానికి బహూకరించాలని భావించారు. రెండు ఏనుగులను భరించడం చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు మావటీలు. అయితే అవి ఉన్న ప్రదేశాలకు వెళ్లి రెండిటిలో ఒకదాన్ని ఎంపిక చేయమని కోరాడు ఆలయ స్థాపకుడు.
ఒక మంచి రోజు చూసుకుని మొదటి ఏనుగు దాత దగ్గరకు వెళ్లారు మావటీలు. వారికి ఏనుగును చూపాడు దాత. ఆ ఏనుగు అలంకరణలతో ఉంది. ఎంపిక చేసే పనిలో పడ్డారు మావటీలు. ఇక దాన్ని ఎంపిక చేయడం ఖాయమని భావించాడు దాత. చిన్నగా ఏనుగు నుదిటిపై బంగారు రంగులో ఉండే నెట్టిపట్టం, మెడకు, కాళ్లకు ఉండాల్సిన గంటలు, వీపు మీద అలంకరించే పట్టు వస్ర్తాలు, ఏనుగుపైన కూర్చునే వారు పట్టుకునే గొడుగులు అన్నీ తీసుకుని ఉత్త ఏనుగును ఇవ్వబోయాడు. దాత సంకుచిత మనస్తత్వం నచ్చని మావటీలు పది రోజుల తర్వాత వచ్చి కలుస్తామని చెప్పి అక్కడినుంచి వచ్చేశారు.
మరో దాత ఉన్న గ్రామానికి వెళ్లారు. ఆ ఏనుగు కూడా అలంకరణలతో ఉంది. ఏనుగుకు ఉన్న ఆభరణాలు, అలంకరణలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచి తీసుకెళ్లమని కోరాడు దాత. వారు సంతోషంగా దాన్ని స్వీకరించారు. వస్తూవస్తూ నదిలో దానికి శుభ్రంగా స్నానం చేయించి ఆలయం దగ్గరికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఆలయ స్థాపకుడు మొదటి ఏనుగును కాదనడానికి కారణమేమిటని మావటీలను అడిగాడు. అలంకరణలు తీసి ఏనుగును ఇవ్వదలిచిన దాత దానిని మనస్పూర్తిగా ఇవ్వలేదు. ఎందుకంటే ఏనుగు తనది కాదనుకున్నాక కూడా దానిపై ఉండే వస్తువుల మీద అతనికి వ్యామోహం తగ్గలేదు. అలాంటి వ్యక్తి దగ్గర ఏనుగును దానంగా తీసుకోవడం మాకు నచ్చలేదు. అతను దానాన్ని నలుగురి మెప్పుకోసం చేస్తున్నట్లుగా తోచిందని వివరించారు. మావటీల వివరణకు ఆలయ స్థాపకుడు ఆనందించాడు. ఆ సంవత్సరం జరిగిన ఉత్సవంలో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
…? ఆర్సీ కృష్ణస్వామి రాజు
93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

