కరెంట్ మీటర్?
వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ టోర్నీలో 6.27 మీటర్ల ఎత్తు ఎగిరి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్ట్ దిగ్గజం ఎవరు?
మీ జీకే.. ఓకేనా?
- వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ టోర్నీలో 6.27 మీటర్ల ఎత్తు ఎగిరి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్ట్ దిగ్గజం ఎవరు?
- దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీది ఘనమైన చరిత్ర. ఈ సీజన్లో ట్రోఫీని విదర్భ జట్టు మూడోసారి ఎగరేసుకుపోయింది. అయితే, తొలిసారిగా ఏ జట్టు ఫైనల్స్
చేరుకుని వార్తల్లో నిలిచింది? - జాతీయ వన్యప్రాణి మండలి మార్చి 3న వెలువరించిన నివేదిక ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయి?
- భారతీయ స్టాక్ మార్కెట్ లావాదేవీల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
- ఇటీవల రెండు భారత ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా పొందాయి. ఆర్థిక స్థితిగతులు, ఆదాయం, లాభార్జన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ హోదా ఇస్తుంది. ఆ సంస్థలు ఏవి?
- నల్లగొండ జిల్లాకు చెందిన రైతు ఒకరు దేశంలోనే మొదటిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటుచేశాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలకు గాను ఆయన ఇటీవల ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అందుకున్నాడు. ఆయన ఎవరు?
- అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ‘బ్లూ ఘోస్ట్’ అనే ల్యాండర్ మార్చి 2న చంద్రుడిపై విజయవంతంగా దిగింది. ఇలా అడుగుపెట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సాధించింది. అది ఏది?
- మార్చి 3న ప్రతిష్ఠాత్మక అకాడమీ (ఆస్కార్) పురస్కారాలు ప్రకటించారు. ‘అనోరా’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అయితే, ఒకేసారి నాలుగు ఆస్కార్లు దక్కించుకున్న వ్యక్తిగా ఎవరు వార్తల్లో నిలిచారు?
- రష్యాకు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ ఒకరు ఫిబ్రవరి 27న మరణించారు. 1972లో ఈయన ప్రసిద్ధ అమెరికా ఆటగాడు బాబీ ఫిషర్‌తో జరిగిన ‘మ్యాచ్ ఆఫ్ ద సెంచరీ’లో ఓడిపోయాడు. అతని పేరేంటి?
- ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌తో తెలుగువాళ్లకు ఓ అనుబంధం. ఆయన ఓ టాలీవుడ్లో అతిథి పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి. ఏ చిత్రంలో?
జవాబులు
1. అర్మాండ్ డుప్లాంటిస్
2. కేరళ క్రికెట్ జట్టు
3. 6,327
4. తుహిన్ కాంత పాండే
5. ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)
6. లోకసాని పద్మారెడ్డి
7. ఫైర్ ఫ్లై ఏరోస్పేస్
8. అనోరా నిర్మాత సీన్ బేకర్ (ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం, ఎడిటింగ్)
9. బోరిస్ స్పాస్కీ (88)
10. నితిన్ హీరోగా వస్తున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా
Read Today's Latest Current-affairs News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

