భర్త హత్య కేసులో భార్యకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష
భార్యకు జైలు శిక్ష | క్షణికావేశంతో భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన భార్యకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఏడో అదనపు జిల్లా జడ్జి కే

వరంగల్ లీగల్ : క్షణికావేశంతో భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన భార్యకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఏడో అదనపు జిల్లా జడ్జి కే ప్రభాకర్ రావు తీర్పు ఇచ్చారు.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే నగరంలోని శంభునిపేట సమీపంలోని బుడగ జంగాల కాలనీలో యాక లక్ష్మీ తన భర్త చిల్ల రాజ్‌కుమార్‌తో కలిసి నివసిస్తుండేది. వీరిద్దరిది ప్రేమ వివాహం, వారికి ఇద్దరు పిల్లలు కూడా, అయితే రాజ్‌కుమార్ మద్యానికి బానిసై ఏ పని చేయకుండా నిత్యం భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అనేక పర్యాయాలు గొడవలు జరిగాయి. పెద్ద మనుషులు కూడా వీరిద్దరికి నచ్చచెప్పారు. అయినప్పటికీ తన తీరు మార్చుకోకుండా భార్యకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఉండడంతో విసిగివేసారిన యాకలక్ష్మి తన భర్తను 2019, డిసెంబర్ 12వ తేదీన గొడ్డలితో నరికి హత్య చేసింది.
రాజ్‌కుమార్ తమ్ముడు రాజు ఫిర్యాదుతో అప్పటి మిల్స్ కాలనీ సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజే యాక లక్ష్మీని పోలీసులు అరెస్టు చేసి ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన అదనపు జిల్లా జడ్జి ప్రభాకర్ రావు.. యాక లక్ష్మి ఈ హత్యకు కారకురాలు అని నిర్ధారించారు, అయితే ఈ హత్య క్షణికావేశంతో చేసిన చర్యగా భావించి నిందితురాలికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ అబ్దుల్ నబీ వాదించారు. కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ దవుడు ప్రతాప్ ఈ కేసులో సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

