దారుణం: పులిని చంపి.. బండరాళ్లు కట్టి బావిలో పడేశారు

భోపాల్: ఒక పులిని కొందరు చంపి దాని శరీరానికి బండ రాళ్లు కట్టి బావిలో పడేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(బీటీఆర్)కు చెందిన టీ-32 పేరున్న 14 ఏండ్ల ఆడ పులిని గుర్తు తెలియని వ్యక్తులు గాయపరిచి చంపేశారు. అనంతరం పులి మృతదేహానికి రెండు బండ రాళ్లు కట్టి మన్పూర్ బఫర్ జోన్ పరిధిలోని తమ్నా బాసా గ్రామం సమీపంలోని బావిలో పడేశారు.
ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి కలేబరాన్ని బావి నుంచి పైకి తీశారు. దాని ముఖంపై పదునైన ఆయుధం వల్ల కలిగిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పులి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్లు బీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విన్సెంట్ రహీమ్ తెలిపారు. పులి మరణంపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
కాగా, ఈ ఆడ పులి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈనిందని, పలు పులి పిల్లలకు జన్మనిచ్చిందని విన్సెంట్ తెలిపారు. గణాంకాల ప్రకారం బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో వందకుపైగా పెద్ద పులులు ఉన్నాయని వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

