Crime |నకిలీబాబా చేతిలో మోసపోయిన మహిళ

శేరిలింగంపల్లి : కాలభైరవ పూజతో ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ చేయిస్తానంటు ఓ ఎంబీబీఎస్ గాడ్యుయేట్ను బురిడీ కొట్టంచిన నకిలీబాబాపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గచ్చిబౌలి ఇన్స్ఫెక్టర్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం…పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని 2011లో నగరానికి వలసవచ్చి కొండాపూర్‌లో నివాసం ఉంటుంది.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన గాడ్యుయేట్లు మనదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పాస్ అవ్వాలి. ఈ క్రమంలో పలుమార్లు ఎఫ్ఎంజీఈ పరీక్షలు రాసిన సదరు మహిళ పాస్ కాలేకపోయింది. పేస్‌బుక్‌లో ప్రకటనలు చూసిన సదరు మహిళ సోదరి ఓ స్వామిజీ పూజలు చేసి పరీక్షలు పాస్ చేయిస్తాడంటు చేసిన ప్రకటనలు చూపించింది.
దీంతో 2020 లో సదరు ప్రకటనలు చూసిన మహిళ పశ్చిమ బెంగాల్‌కు చెందిన విశ్వజిత్ అనే నకిలీబాబాను పేస్బుక్ ద్వారా ఆశ్రయించింది. తన ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ చేయించాలని విశ్వజిత్‌ను కోరింది. ఆ నకిలీబాబాకు కాలభైరవ పూజ పేరిట 2021 జూలై వరకు విడతల వారిగా దాదాపు రూః 80,000 చెల్లించింది. అ తర్వాత సదరు విశ్వజిత్ బాబా నుంచి స్పందన లేకపోవడం, అతని ఫోన్ స్విచ్చాప్లో ఉండడంతో తాను మోసపోయానని గ్రహించి గచ్చిబౌలి పోలీసులను గత జూలైలో అశ్రయించింది.
బాదితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు నకిలీబాబా విశ్వజిత్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. పశ్చిమబెంగాల్‌కు ప్రత్యేక బృందాన్ని పోలీసులు పంపించి దర్యాప్తు వేగవంతం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

