అద్దె కార్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు.. 50 కార్లు స్వాధీనం
50 కార్లు స్వాధీనం | కార్లకు అధిక అద్దె చెల్లిస్తామంటూ తీసుకొని యజమానులకు తెలియకుండా విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.

హైదరాబాద్ : కార్లకు అధిక అద్దె చెల్లిస్తామంటూ తీసుకొని యజమానులకు తెలియకుండా విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. తన కారును అద్దెకు తీసుకొని కొందరు అక్రమంగా విక్రయించారని ఓ బాధితుడు జనవరిలో ఆర్సీపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు. సోమవారం ఆర్సీపురం పరిధిలో కొందరు అద్దె కార్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో చాకచక్యంగా వ్యవహరించి ఆరుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అధిక అద్దె చెల్లిస్తామని నమ్మించి నగరంలోని పలువురు నుంచి వీరు కార్లను తీసుకున్నారు.
ఇలా అద్దెకు తీసుకున్న కార్లను సగం రేట్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పలు స్టేషన్ల పరిధిలో ఇదే తరహా కేసులు ఉన్నాయని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

