షాకింగ్ : లైంగిక వేధింపుల కేసులో ఎన్సీబీ సూపరింటెండెంట్ అరెస్ట్

ముంబై : కదులుతున్న రైలులో మహిళను ఎన్సీబీ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఔరంగాబాద్‌లో 35 ఏండ్ల నిందితుడిని పర్లీ రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు, బాధితురాలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని హదప్సర్కు రైలులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. మహిళా ప్రయాణీకురాలు నిద్రిస్తుండగా నిందితుడు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నిందితుడి నిర్వాకం పసిగట్టిన బాధితురాలు పెద్దగా అరవడంతో తోటి ప్రయాణీకులు అక్కడికి వచ్చి నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తిరిగి తన గమ్యస్ధానానికి చేరుకున్నారు. నిందితుడు గత ఎనిమిది నెలలుగా మానసిక వైకల్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. గత రెండు వారాలుగా సెలవులో ఉన్న నిందితుడు ఓ కేసు విచారణకు హాజరైనట్టు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడిపై శాఖాపరమైన చర్యలకు యోచిస్తున్నామని ఎన్సీబీ అధికారుల తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

