దారుణం.. మూడేళ్ల కుమారుడిని కొట్టి చంపిన తల్లి
కుమారుడిని కొట్టి చంపిన తల్లి | మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్నప్రేమను మరిచిన ఓ తల్లి కర్కోఠకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట్టి హతమార్చింది.

మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్నప్రేమను మరిచిన ఓ తల్లి కర్కోఠకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట్టి హతమార్చింది. సూరారం పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దారుణానికి ఒడిగట్టిన మహిళ రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నది. ఉదయం విక్షణ కోల్పోయిన ఆమె కుమారుడు ఉమేశ్(3)ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరాడు. దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇద్దరి మధ్య కుమారుడి అడ్డున్నాడనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

