అహ్మదాబాద్ : మనవరాలి వయసున్న బాలికపై 62 ఏండ్ల వృద్ధుడు రెసిడెన్షియల్ సొసైటీ లిఫ్ట్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. లిఫ్ట్‌లో ఏర్పాటైన సీసీటీవీ కెమెరాలో మొత్తం ఘటన రికార్డవడంతో వృద్ధుడు పట్టుబడ్డాడు. జగత్‌పూర్‌కు చెందిన నిందితుడు భానుప్రతాప్ రాణాను పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బాలిక (9) స్కూల్ నుంచి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. రెసిడెన్షియల్ సొసైటీలోని 11వ అంతస్తులోని ఇంటికి వెళ్లేందుకు బాలిక లిఫ్ట్‌లోకి రగా, అప్పటికే అక్కడ ఉన్న రాణా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
బాలిక ఇంటికి చేరగానే తల్లితండ్రులకు చెప్పడంతో వారు లిఫ్ట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆపై చంద్ఖేడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌తో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.