టిక్‌టాక్ వీడియోనే ఆమె ప్రాణాలు తీసిందా?.. 1100 కిలోమీటర్లు ప్రయాణించి చంపేసిన భర్త!
విడాకులు అనేవి విఫలమైన వివాహ జీవితాలకు సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కొంతమందికి అవి విముక్తి కలిగిస్తే.. మరికొందరికి చేదు జ్ఞాపకాలుగానే ఉంటాయి. అలాగే జరిగింది పాకిస్తానీ అమెరికన్ అయిన సానియా ఖాన్ జీవితంలో. ఆమె ఐదేళ్ల పాటు రాహేల్ అహ్మద్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో విడాకులు తీసుకున్నారు.
అనంతరం టిక్ టాక్‌లో విడాకులు తీసుకొని, ట్రామాలో ఉన్న మహిళలకు సలహాలు ఇస్తూ సానియా మంచి ఫాలోవర్లను సంపాదించుకుంది. అలాగే పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు ఫొటోగ్రఫీ కూడా చేసేది. ఇటీవల ఒక టిక్‌టాక్ వీడియోలో తన విడాకుల గురించి, ఆ చేదు అనుభవాల గురించి చెప్పింది. ఈ విషయం భర్త రాహేల్కు నచ్చలేదు. దీంతో జార్జియా నుంచి చికాగోకు వచ్చి మరీ ఆమెను కాల్చిపారేశాడు.
సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సానియా, రాహేల్ ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సానియాను చంపిన తర్వాత రాహేల్ కూడా అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాహేల్ ఇంటి నుంచి సడెన్‌గా అలా వెళ్లిపోవడంతో పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చిన అతని కుటుంబం.. ‘‘పెళ్లి సమస్యను పరిష్కరించడానికి’’ వెళ్తున్నట్లు చెప్పాడని తెలిపారు. సానియా మృతి పట్ల ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. చికాగో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నానని, త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పినట్లు స్నేహితులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- divorce
- Telugu News
- tik tok
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

