కంట్లో కారం చల్లి… నగలు దోచుకున్న తండ్రీకూతుళ్లు
లక్నో: తండ్రీకూతుళ్లు కలిసి నగల చోరీకి పాల్పడ్డారు. జ్యుయలరీ షో రూమ్ సిబ్బంది కంట్లో కారం చల్లి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం సిహాని గేట్ ప్రాంతంలోని ఒక జ్యుయలరీ షాపునకు తండ్రీ, కుమార్తె వెళ్లారు. కస్టమర్ల మాదిరిగా వారిద్దరూ బిల్డప్ ఇచ్చారు. గోల్డ్ చెయిన్ల కొనుగోలు కోసం అక్కడి సిబ్బందితో మాట్లాడారు. కుమార్తె పక్కనే కూర్చోగా ఆ వ్యక్తి గోల్డ్ చెయిన్‌ను తన మెడలో వేసుకుని ముందున్న అద్దంలో చూసుకున్నాడు. అనంతరం అతడి మెడలోని గొలుసును తీసేందుకు సిబ్బంది సహకరించారు.
కాగా, కుమార్తె ఉన్నట్టుండి తన చేతిలోని కారాన్ని సిబ్బంది ముఖంపై చల్లింది. మరోవైపు ట్రేలోని బంగారు నగలను ఆ వ్యక్తి లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే సిబ్బందిలో ఒకరు ఆ మహిళ వేసుకున్న టీ షర్టు కాలర్‌ను గట్టిగా పట్టుకుని పారిపోకుండా నిలువరించారు. దీంతో ఆ వ్యక్తి కుమార్తె వారికి చిక్కింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

