Crime News | ఢిల్లీ వ్యాపారికి స్వీట్ బాక్స్‌తోపాటు బెదిరింపు లేఖ.. బుల్లెట్లు కూడా..!
Crime News | ఢిల్లీలోని ఒక వ్యాపారవేత్తకు ఆగంతకుల నుంచి స్వీట్ బాక్స్ తోపాటు బుల్లెట్లు, ఒక బెదిరింపు లేఖ అందింది.
Crime News | ఢిల్లీలోని ఒక వ్యాపారవేత్తకు ఆగంతకుల నుంచి స్వీట్ బాక్స్ తోపాటు బుల్లెట్లు, ఒక బెదిరింపు లేఖ అందింది. నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో నివసిస్తున్న వ్యాపారవేత్త ఇంటి బయట ఒక స్వీట్ బాక్స్, బెదిరింపు లేఖ, రెండు లైవ్ క్యాట్రిడ్జ్ (బుల్లెట్లు) లు దొరికాయని పోలీసులు శనివారం తెలిపారు. ఈ విషయమై గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీలోని 506 సెక్షన్, ఆయుధాల చట్టంలోని 25 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని చెప్పారు. బాక్స్ చూసిన తర్వాత సదరు వ్యాపార వేత్త స్థానిక పోలీసులను ఆశ్రయించారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
సదరు బెదిరింపు లేఖ చేతి రాతతో ఉందని, కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు రాశారని తెలిపారు. ‘కొందరు వ్యక్తిగత శత్రువుల నుంచే ఈ బెదిరింపు వచ్చినట్లు కనిపిస్తున్నదని అనుమానిస్తున్నాం’ అని పేర్కొన్న ఆ అధికారి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపార వేత్త ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీలను విశ్లేషించడం ద్వారా అనుమానితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

